ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 4:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నూతన జెండా, కండువాల ఆవిష్కరణ..ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా టీఎన్జీవో నాయకులు.జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.

ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నూతన జెండా, కండువాల ఆవిష్కరణ..ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా టీఎన్జీవో నాయకులు.జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.

అర్జున్ సమాచారం. ఆగస్టు 24. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

నస్పూర్, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన జెండా, కండువాలను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఘనంగా ఆవిష్కరించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ నూతన జెండా, కండువాల ఆవిష్కరణ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా సంఘానికి, కేంద్ర సంఘానికి ఉద్యోగుల సహాయ సహకారాలు నిరంతరం అందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రవణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అనుబంధ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి, రామ్ కుమార్, సత్యనారాయణ, నరేందర్, సంయుక్త కార్యదర్శులు సునిత, అంజయ్య, కార్తీక్, ప్రభు, పద్మలత, సురేందర్, రోశయ్య, నిర్వహణ కార్యదర్శి మోసిన్, ప్రచార కార్యదర్శి యూసుఫ్, క్రీడల కార్యదర్శి కుమార్, కార్యవర్గ సభ్యులు రాజేందర్, జ్యోతి పాల్గొన్నారు.మంచిర్యాల విభాగం అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి విభాగం అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి విభాగం అధ్యక్షుడు వెంకటేష్, చెన్నూరు విభాగం అధ్యక్షుడు అభిషేక్, లక్షెట్టిపేట విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.